Jan 24,2023 09:38

ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

           పుట్టపర్తి అర్బన్‌ : ఉగాది నాటికి నిర్ధేశించిన గహ నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 174 పిల్లలను ప్రజల నుంచి కలెక్టర్‌ స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా, అధికారులతో మాట్లాడుతూ ఉగాది నాటికి 10,750 నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిత్యం లక్ష్యాలను పూర్తి చేయడానికి కషి చేయాలన్నారు. నిర్మాణాలు పూర్తి కావడానికి, లబ్ధిదారులను అవగాహన కల్పించాలన్నారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన 1,195 పనులకు 1,072 పనులు మంజూరు కాగా, 913 పనులు పూర్తి గ్రౌండింగ్‌ అయినాయని మిగిలిన 157 పనులు వెంటనే గ్రౌండింగ్‌ చేయాలన్నారు. ప్రతినెలా పనులపై సమీక్షించాలన్నారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద భూహక్కు పత్రాలు 668 పత్రాలు పంపిణీ జరిగిందన్నారు. మిగతా పనులు త్వరగతిన పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 35 శాతం పనులు జరుగుతున్నాయని కూలీల సంఖ్య మరింత పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, పిఆర్‌ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ చాంద్‌ బాషా, డిసిఒ కష్ణనాయక్‌, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డీఈఓ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.