Jan 25,2023 21:42

గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌లో పాల్గొన్న ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌

        పుట్టపర్తి రూరల్‌ : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానం మస్తాబు అయ్యింది. గురువారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. వేడుకల నేపథ్యంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ పరేడ్‌ మైదానంలో అధికారులతో సమీక్షించారు. ముఖ్య అతిథులు హాజరు, జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, వాహనంపై వెళ్లి పరేడ్‌ రిహార్సల్స్‌ను ఎస్పీ పరిశీలించారు. ఈ సదర్భంగా పలు అంశాలపై ఎస్పీ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రామకష్ణ ప్రసాద్‌, డీఎస్పీ ఉమామహేశ్వర్‌ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.