Jul 16,2021 12:23

గన్నవరం (విజయవాడ) : విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాలకు అనుకూలంగా కొత్త రన్‌ వే ప్రారంభమయింది. స్థానిక విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్‌వే 26 ను గురువారం ఉదయం అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోడ్‌-ఈ హోదా లభించడంతో బోయింగ్‌ 737, 747 లాంటి భారీ స్థాయి విమానాల రాకకు కూడా వీలుంటుంది. విమానాశ్రయ డైరెక్టర్‌ మధుసూదనరావు మాట్లాడుతూ... 3360 మీటర్ల రన్‌వేతో భారీ విమానాల రాకకు అవరోధాలు తొలగాయని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 7.10 గంటలకు విజయవాడకు చేరుకున్న ఎయిర్‌ ఇండియా (ఏఐ-459) సర్వీసు ల్యాండింగ్‌తో నూతన రన్‌వే అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.