Mar 01,2023 20:22

- గిరి ప్రదక్షణలో పాల్గొన్న ప్రజలు

వల్లూరు : పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి చుట్టూ గిరి ప్రదక్షణ చేయడం శుభకరం కలుగుతుందని పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యా శంకర భారతి అన్నారు. బుధవారం మండలంలోని పుష్పగిరిలో ఉదయం నుంచి పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించి 11 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ గిరి ప్రదక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన పుష్పగిరిలో వైద్యనాథేశ్వరుడు ఉండడం బ్రహ్మ, విష్ణుమహేశ్వర కొలువైన ఉన్న పుష్పగిరికి ప్రదక్షిణ చేస్తే మంచిదన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గిరిప్రదక్షిణను విజయవంతం చేశారు. అనంతరం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతితో కలిసి కొంత దూరం ప్రదక్షిణ చేసి పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.