చిన్నమండ్యం : గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వచ్చే ఎన్నికల్లో మరల వైసిపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఆశయాలను ప్రజల చెంతకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులుపై ఉందన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అన్న నినాదంతో జగనన్న ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలన్నారు. గహ సారథులు వారికి అందచేసిన సామగ్రిలోని బ్యాడ్జీలు ధరించి, వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాలతో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమి చేశారో, ఇప్పటి మన జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఏమి మేలు చేస్తున్నామో ఉంటుందని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలును, పార్టీ విధానాలును వివరించాలని సూచించారు. కార్యక్రమంలో తొగటవీరక్షత్రియ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం వీరాంజనేయ ప్రసాద్, చిన్నమండెం వైస్ ఎంపిపి ఎజాస్‌ఆలీఖాన్, రాష్ట్ర కురబసంఘము కార్పొరేషన్ డైరెక్టర్ పడిగల రమణ, కో-ఆఫ్షన్‌మెంబర్ గౌస్, మాజీసర్పంచ్ సలీం, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ చుక్క అంజనప్ప, ఎంపిటిసిలు రమేష్, వెంకటప్ప నాయుడు, శ్యామ్ చంద్ర, రెడ్దెప్ప, రమణ, శ్రీరాములు, శ్రీదేవి, కష్ణమ్మ, సర్పంచులు లక్ష్మీ రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, దామోదర్, ఆఫ్రోజ్, మంజుల, జయమ్మ, దేవపట్ల నజీర్ బాషా,కళ్ళు రమణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










