కొలంబో : శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడబోయే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. జూలై 18 (ఆదివారం) నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలు, 3 టి20ల సిరీస్‌ల కోసం 25 మంది సభ్యులతో కూడి జంబో జట్టును ఎంపిక చేసింది. 6 మ్యాచ్‌లకూ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. కాగా, గాయం కారణంగా కెప్టెన్ కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో ఈ సిరీస్‌లకు దూరమయ్యారు. దీంతో దాసన్ షనకను తమ నూతన కెప్టెన్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. గత నాలుగేళ్లలో శ్రీలంకకు షనక ఆరో కెప్టెన్. 2018 నుంచి దినేశ్ చండీమల్, ఎంజేలో మాథ్యూస్, లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే, కుశాల్ పెరీరా కెప్టెన్లుగా వ్యవహరించారు.
శ్రీలంక జట్టు :
దాసన్ షనక (కెప్టెన్), ధనుంజయ డిసిల్వా (వైస్ కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, వానిందు హరసరంగ, యాషెన్ బండార, మినొద్ భానుక, లాహిరు ఉడారా, రామేశ్ మెండీస్, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షణ్ సందకన్, అకిలా ధనుంజయ, షిరన్ ఫెర్నాండో, ధనుంజయ లక్షణ్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రెమా, అసితా ఫెర్నాండో, కసున్ రజితా, లాహిరు కుమార, ఇసురు ఉడాన, కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో (గాయంతో దూరం)










