ప్రజాశక్తి - కర్నూలు క్రైం : ప్రపంచ తొలి కెమెరా ఆవిష్కర్త లూయీస్ గుడారే 171వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా ఫొటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆ సంఘం నాయకులు ఆదివారం స్థానిక మహమ్మదీయ వక్ఫ్స్ కాంప్లెక్స్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ ఫొటోగ్రఫికి 15 దశాబ్దాల క్రితమే ఆయన ప్రాణం పోశాడన్నారు. నేటి అత్యాధునిక ఫొటో గ్రఫీకి ఆయన ఆవిష్కరణే పునాది రాయిగా నిలిచిందన్నారు. తన అవిష్కరణ కారణంగా నేడు కోట్లాది మందికి ఫొటోగ్రఫీద్వారా జీవనోపాధి పొందుతున్నారన్నారు. అంతేకాకుండా ప్రజల మధురాను భూతులను పదిలంగాచిత్రాల్లో దాచుకునే అవకాశాన్ని ఆయన కల్పించి ప్రపంచ ఫొటోగ్రఫీ పితామహుడుగా ఖ్యాతిని గాంచారన్నారు. ప్రతి ఫొటోగ్రాఫర్ ఆయనకు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, రంగ, ఈశ్వర్, మధు, గోవింద్, నాయుడు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










