ఆకాశాన్ని చేరాలన్న ఆకాంక్ష ఒకవైపు
వెంటాడే పేదరికం మరోవైపు
బలహీనవర్గం అని నాయకుల చిన్నచూపు
బ్రతికే అర్హత లేదని కొందరి మాట విడుపు
మౌనంతో ముందుకు సాగాలో
ప్రశ్నిస్తూ పరుగులు పెట్టాలో
అర్థం కాని చిక్కుముడి..
మధ్యలో మిగిలిపోయాయి!
గొప్పగా బ్రతకాలి అనుకున్న మా జీవితాలు
ఎందుకు అంత వ్యత్యాసం..!
మేమూ మనుషులమే కదా
జీవమున్న ప్రాణులమే కదా
పని చేయగల సత్తా మాకుంది
బతుకు బాటసారులమే కానీ
ఎవర్నీ ఇబ్బంది పెట్టే గుణం మాకు లేదు
ఉన్న దానిలో తృప్తిపడి తినేవాళ్ళమే కానీ
ఉన్నతి కోసం అంత ఆరాటం లేదు
నాలుగు వేళ్ళు నోటిలోపలికి పోవాలన్న
తాపత్రయమే తప్ప
చచ్చి ఏదో పట్టుకుపోవాలని లేదు
కాస్త మర్యాద కావాలి
ఇంకాస్త గౌరవం కావాలి
ఇవి చాలు మా జీవితాలకు..
పోలగాని భానుతేజశ్రీ
కృష్ణాజిల్లా