Jul 14,2021 17:57

అమరావతి : ఎపిలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. ఒక రోజు తగ్గినట్లే తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. మరుసటి రోజు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 2,567 నమోదు కాగా.. తాజాగా 2,591 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 90,204 నమూనాలను పరీక్షించగా.. 2,592 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 511 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,329 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహ్మమారి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,32,20,912 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 19,29,579 మంది కరోనా బారిన పడగా.. 18,90,565 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 13,057 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేట్‌ 2.8 శాతం ఉండగా.. రికవరీ రేటు 98 శాతం ఉంది. కరోనా మరణాల శాతం 0.68గా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.