అమరావతి: రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
- నెల్లూరులోని మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం సాధించింది.
చేజర్ల మండలం పాతపాడు లో రీకౌంటింగ్ లోను సమాన ఓట్లు రావడంతో లాటరీ నిర్వహించిన అధికారులు. లాటరీలో వైసీపీ అభ్యర్థి షేక్.మస్తాన్ బి విజయం సాధించింది.
- ఏలూరులోని దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పెదపాడు మండలం, పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన 10వ వార్డు ఎన్నికలలో వైసిపి బలపరిచిన అభ్యర్థి గొట్టపు సోమేశ్వరి 26 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
జీలుగుమిల్లి గ్రామంలో 6వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన మడకం ధనరాజు 42ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- పశ్చిమగోదావరిలోని పాలకొల్లు మండలం గోరింటాడా గ్రామపంచాయతీ ఆరో వార్డు వైసిపి బలపరిచిన అభ్యర్థి పీతల యమున దుర్గ చంద్రకళ 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో ఆరో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థి అంగర రామలక్ష్మి 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
వీరవాసరం మండలం మత్యపురి గ్రామం ఒకటో వార్డు లో వైసిపి బలపరిచిన కారేంపల్లి విజయలక్ష్మి 167 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.
- ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా వైసిపి బలపరిచిన చలివేంద్ర హరిబాబు విజయం సాధించారు
టిడిపి బలపరిచిన అభ్యర్దుల ఫలితాలు
- కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని గండిగుంట గ్రామంలో పదో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో తెదేపా బలపరిచిన వీరంకి పాండురంగారావు 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- ఏలూరు జిల్లా పోలవరం మండలం చేగొండపల్లి ఆరో వార్డు ఉప ఎన్నికలో టిడిపి బలపరిచిన అభ్యర్థి మూలం రాజు విజయం సాధించారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామ సర్పంచ్‌గా వైసిపి బలపరచిన వేము రాజు 320 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు
- నెల్లూరుజిల్లాలోరాపూరు మండలం పులిగిలపాడులో వార్డు ఎన్నికలో టిడిపి బలపరిచిన నిమ్మల రాజమ్మ వైసిపి మద్దతుదారుపై 23 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
జలదంకి మండలం వేములపాడు 7వ వార్డును టిడిపి బలపరిచిన పొట్లూరి ఆదిలక్ష్మి 34 ఓట్ల మెజార్టీతో సొంతం చేసుకున్నారు.
కొండాపురం మండలం సాయిపేట 3వ వార్డులోటిడిపి మద్దతుదారు సానంంగుల రవి 65 ఓట్ల తేడాతో గెలుపొందారు.
చేజర్ల మండలం పాతపాడు ఐదో వార్డు ఎన్నికలో టిడిపి, వైసిపి మద్దతుదారులిద్దరికీ.. సమానంగా 32 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించారు.
- పశ్చిమ గోదావరి తణుకు మండలం తేతలి 8వ వార్డుకు హౌరా హౌరీగా జరిగిన ఎన్నికలలో టిడిపి బలపరచిన కోట దుర్గా రావు 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం 7వ వార్డు ఉప ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థి కుడిపుడి ప్రసాద్ 48 ఓట్లతో గెలుపొందారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు 5వ వార్డు ఎన్నికలో టిడిపి బలపరిచిన కాకి రామకృష్ణవేని 128 ఓట్ల తేడాతో గెలుపొందారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని దమ్మెన్ను గ్రామ పంచాయతీ 9వ వార్డుకు శనివారం జరిగిన ఉప ఎన్నికలో మట్టపర్తి అచ్యుత రామన్న విజేతగా నిలిచినట్లు రిటర్నింగ్ అధికారిణి కే సరోజిని ప్రకటించారు.
- అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం లింగరాజుపాలె 5వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో టిడిపి మద్దతుదారు కుప్పలా నాగనూక గౌరి 11 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గాదంపాలెం పంచాయతీ రెండో వార్డుకు జరిగిన ఎన్నికలో వైసిపి బలపరిచి రాజేశ్వరి 3 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్ పేట 7వ వార్డులో టిడిపి మద్దతుదారువల్లూరు శివానందం విజయం సాధించారు.
- అనంతపురంలోగార్లదిన్నె మండలం బూదేడు గ్రామపంచాయతీ 9 వార్డు ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థి సుంకమ్మ 21 ఓట్లతో విజయం సాధించారు.
అనంతపురం జిల్లాలోని నార్పల మేజర్ పంచాయితీ 8వ వార్డు ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతు దారు అభ్యర్థి కొత్త మిద్దె నాగభూషణం తన సమీప ప్రత్యర్థి తలారి ప్రసాద్‌పై 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.
యల్లనూరు మండలం బప్పేపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యుడిగా వైసిపి బలపరిచిన అభ్యర్థి మంజుల లీలావతి 65 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
యల్లనూరు మండలం జంగం పల్లి గ్రామ సర్పంచి ఉప ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థి కుళ్ళాయప్ప నాయుడు 18 ఓట్లతో విజయం సాధించారు.
- బాపట్లలో కొల్లూరు మండలం చిలుమూరు 4వ వార్డులో టిడిపి విజయం టీడీపీ విజయం సాధించింది.
కొల్లూరు మండలం దోనేపూడి 5వ వార్డులో టిడిపి గెలుపొందింది.
అమర్తలూరు మండలం మూల్పురులో 2వార్డులో టిడిపి, 4వార్డులో వైసిపి మద్దతుదారులు విజయం సాధించారు.
వేమూరు మండలం వరాహపురం పదో వార్డులో వైసిపి మద్దతుదారు గెలుపొందారు.
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల వైసిపి కార్యకర్తలు.. టిడిపి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త నెలకొంది. వైసిపి కార్యకర్తలు.. టిడిపి కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ తమపై దాడులు చేయిస్తున్నారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
- ప్రకాశంలో టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామం ఉప ఎన్నికలో టిడిపి బలపరిచిన అభ్యర్థి పిడికిటి శ్రీనాథ్ 68 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో జరుగుతున్న ఒకటో వార్డు ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బాదర్ సింగ్ గారి బాలాజీ సింగ్ వైసీపీ అభ్యర్థిపై 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ మూలగుంటపాడు 10వ వార్డు సభ్యునిగా టిడిపి బలపరచిన అభ్యర్థి అంబటి శ్రీనివాసులు 63 ఓట్లు మెజారిటీ గెలుపొందారు.
చెన్నపనాయునీ పల్లి గ్రామంలో జరిగిన వార్డు సభ్యుని ఉప ఎన్నికల్లో టిడిపి బలపర్చిన అభ్యర్థి యనమల వెంకట నాగరాజు 4 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.










