వైద్య సేవలు పొందుతున్న తండ్రితో ఎమ్మెల్సీ
ప్రజాశక్తి-హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్ తండ్రి షేక్ గౌస్ సాబ్ అనారోగ్యంతో శనివారం మతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఓ ప్రయివేటు అసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఈనేపథ్యంలో శనివారం పట్టణంలోని 12వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న సమయంలో తండ్రి మరణవార్త రావాడంతో ఎమ్మెల్సీ ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.










