- విద్యుత్ వినియోగదారులపై మరోవడ్డన
- కొత్తగా యూనిట్‌కు40 పైసలు వసూలు
- ఏడాదికి 3 వేల కోట్ల భారం
- నెలనెలా 'ట్రూఅప్' అమల్లోకి..
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం భారాల మీద భారాలు మోపుతూ విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తోంది. గడిచిన 15 నెలల కాలంలోనే ముచ్చటగా మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నాల్గవసారి కూడా కొత్త భారానిు మోపింది. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ట్రూఅప్ విధానం మే నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్‌సి) అనుమతి లేకుండానే డిస్కమ్‌లు నేరుగా వినియోగదారులపై భారాలు మోపొచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో యూనిట్‌కు 40 పైసలు చొప్పున కొత్త భారానిు వినియోగదారులపై డిస్కమ్‌లు వేశాయి. కొత్తగా కలిసిన ఛార్జీలతో మే నెలలో వచ్చిన అధిక బిల్లులు చూసుకుంటును ప్రజలు బిక్కమొహం వేస్తునాురు. ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు రెండుసార్లు రూ.5,983 కోట్ల భారం మోపాయి. ట్రూఅప్ పేరుతో రూ.2,900 కోట్లను 2022 ఆగస్టు నుంచి, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.3,083 కోట్లను వసూలు చేస్తునాుయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఇంధన సర్దుబాటు ఛార్జీలతో నెలకు రూ.280 కోట్లు, ఏడాదికి సుమారు రూ.3 వేలకోట్ల భారం ప్రజలపై పడనుంది. దీంతో వాడిన విద్యుత్‌తోపాటు ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలకే వినియోగదారులు 15 శాతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు 248 యూనిట్ల విద్యుత్ వాడిన వినియోగదారునికి అసలు బిల్లు రూ.1218.25, దీనికి ఫిక్స్‌డ్, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్‌ఛార్జీలు కలిపితే రూ.1,324 అవుతుంది. ఇతనికి ట్రూఅప్ రూ.53.83, పాత ఇంధన సర్దుబాటు ఛార్జీలు రూ.51.26, కొత్త ఇంధన సర్దుబాటు ఛార్జీలు రూ.97.60 కలుపుకునిరూ.1,536 బిల్లు వచ్చింది. రాష్ట్రంలో 1.90 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉనాురు. మే నెలలో రాష్ట్రంలో సుమారు 7 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. మే నెలలో వాడిన విద్యుత్‌కుఅదనంగా యూనిట్‌కు40 పైసలు చొప్పున డిస్కమ్‌లు వసూలు చేయడంతో సుమారు రూ.280 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే 100 యూనిట్లకుఎపిఎస్‌పిడిసిఎల్ వినియోగదారులు రూ.43, ఇపిడిసిఎల్ వినియోగదారులు రూ.26, సిపిడిసిఎల్ వినియోగదారులు రూ.42 చొప్పున చెల్లిస్తునాురు. ఇప్పుడు కొత్త ఛార్జీలతో ఎస్‌పిడిసిఎల్ వినియోగదారులు 100 యూనిట్లకురూ.83, ఇపిడిసిఎల్ వినియోగదారులు రూ.66, సిపిడిసిఎల్ వినియోగదారులు రూ.82 చొప్పున చెల్లించాలి. ఈ ఛార్జీలు మొదటి త్రైమాసికం వరకుమాత్రమే. రెండు, మూడు, నాల్గవ త్రైమాసికాల్లో ఇవి మారతాయి. రెండో త్రైమాసికంలో ఎస్‌పిడిసిఎల్ వినియోగదారులు రూ.126, ఇపిడిసిఎల్ రూ.110, సిపిడిసిఎల్ రూ.125 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నెలనెలా ట్రూఅప్ విధానంతో ఏడాది చివరిలో కూడా డిస్కమ్‌లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)కి మరోసారి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. దీనికి కూడా ఎపిఇఆర్‌సి ఆమోదిస్తే ప్రజలపై ఐదో భారం పడే ప్రమాదం ఉంది.










