జిల్లాలో ఎఎన్‌ఎం కౌన్సెలింగ్‌లో అయోమయం నెలకొంది. సెకెండ్ ఎఎన్‌ఎం, ఇసిఎఎన్‌ఎం, కాంట్రాక్టు ఎఎన్‌ఎం, సచివాలయ ఎఎన్‌ఎంల కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధమైంది. సీనియారిటీ జాబితా ఆధారంగా సెకెండ్ ఎఎన్‌ఎంల ముందు వరుసలో ఉండాల్సి ఉంది. అనంతరం ఇసి ఎఎన్‌ఎంలు, సచివాలయ ఎఎన్‌ం, కాంట్రాక్టు ఎఎన్‌ఎంలు ఉండాలని తెలుస్తోంది. ఇటీవల నియమితులైన సచివాలయ ఎఎన్‌ఎం, ఇసి ఎఎన్‌ఎంల పేర్లు కూడా సీనియారిటీ జాబితాలో ఉండడం గందరగోళానికి కారణమని తెలుస్తోంది. రెగ్యులర్ ఎఎన్‌ఎంలకు ప్రమోషన్లలో ప్రాధాన్యత ఇస్తే అభ్యంతరం లేదని, సీనియారిటీని విస్మరిస్తే సీనియర్ల పరిస్థితేమిటని సెకెండ్ ఎఎన్‌ఎంలు వాపోతున్న వైనం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లా కేంద్రమైన ఆర్‌డి కార్యాలయ పరిధిలోని 329 మంది ఎఎన్‌ఎంల కౌన్సెలింగ్ రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్‌డి కార్యాలయం శుక్రవారం రాత్రి సీనియారిటీ జాబి తాను ప్రకటించింది. సీనియారిటీలో జూనియర్లు అయిన సచివాలయ, ఇసిఎఎన్‌ఎంల పేర్లు ఉండ డం ఆందోళనకు కారణమని తెలుస్తోంది. 2007లో సెకెండ్ ఎఎన్‌ఎంలు, 2009లో ఇసిఎ ఎన్‌ఎంలు, 2019లో సచివాయల ఎఎన్‌ఎంలు, కాంట్రాక్టు ఎఎన్‌ఎంలను ఆయా ప్రభుత్వాల ప్రాధాన్యాత ఆధారంగా రిక్రూట్‌మెంట్ చేసినట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్‌ల్లో ఎఎన్‌ఎంలకు సీనియారిటీ ఆధా రంగా బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆర్‌డి కార్యాలయం శుక్రవారం సెకెండ్ ఎఎన్‌ఎం, ఇసిఎఎన్‌ఎం, సచివాలయ ఎఎన్‌ఎం, కాంట్రాక్టు ఎఎన్‌ఎం కేటగిరీల్లోని 329 మంది ఎఎన్‌ఎంల సీనియారిటీ ఆధారంగా జాబితాను విడుదల చేసింది. 83 మంది రెగ్యులర్ ఎఎన్‌ఎంలు సీనియారిటీ జాబితాకు అర్హులని తెలుస్తోంది. మిగి లిన సచివాలయ ఎఎన్‌ఎమ్‌లు, ఇసి ఎఎన్‌ఎంలకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వ హించాల్సి ఉండడం ప్రకృతి సహజన్యాయ సూత్రాల ఆధారంగా సమంజసమనే డిమాండ్ వినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే 2022 డిసెంబర్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్‌లోనూ సీని యారిటీ ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతిని సెకెండ్ ఎఎన్‌ఎంలు గుర్తు చేస్తుండడం గమనార్హం. సీనియారిటీ జాబితాలో సెకెండ్ ఎఎన ్‌ఎంల స్థానంలో ఇసి ఎఎన్‌ఎంల పేర్లు చోటు చేసుకోవడంలో మతలబేమిటో ఆర్‌డి కార్యాలయం చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇందులో ఓ సీనియర్ అసిస్టెంట్ మొత్తం వ్యవహారాన్ని నడిపి ంచడమే కారణమనే వాదన వినిపిస్తోంది. ఇప్ప టికైనా జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు రాష్ట్రంలోని నాలుగు జోన్లలో ఎక్కడాలేని విధంగా జోన్-4లోని కౌన్సెలింగులు వివాదాస్పదంగా మారుతుండడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఎఎన్‌ఎంల సీనియారిటీ సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శుక్రవారం నాటి కౌన్సిలింగ్ సమయానికి ఉన్నతా ధికారుల నుంచి ఆదేశాలు అందితేసరి, అందని పక్షంలో యథాతథం గానే కౌన్సెలింగ్ నిర్వహిస్తాం.
- డాక్టర్ కోటేశ్వరి, వైద్య ఆరోగ్య శాఖ ఆర్‌డి, కడప.










