Jul 17,2021 08:02

రాజమండ్రి (తూర్పు గోదావరి) : ఎగువ నుండి చేరుతోన్న వరదలకుగాను ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి వరద పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్‌ నీటిమట్టం 10.50 అడుగులకు పెరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8,200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పునరావాస కాలనీలు, మైదాన ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజలు తరలిపోతున్నారు.