వారణాసి : డిజిటలైజేషన్ దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధాని మోడీ ప్రశంసించారు. పెరుగుతున్న డేటా విభజన సమస్యను హైలెట్ చేస్తూ.. అర్థవంతమైన విధాన రూపకల్పన, సమర్థవంతపు వనరుల కేటాయింపు మరియు ప్రజలకు సమాచారం పంపిణీకి అధిక నాణ్యత కలిగిన డేటా అవసరమని అన్నారు. వారణాసిలో సోమవారం జరిగిన 'జి 20 డెవలప్ మెంట్ మినిస్టర్స్' సదస్సులో వర్చువరల్‌గా ప్రధాని మోడీ పాల్గన్నారు. డేటా విభజనను తగ్గించడంలో సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ కీలకమైన సాధమని అన్నారు. డిజిటలైజేషన్‌తో భారత్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, తన అనుభవాలను భారత్ పొరుగుదేశాలతో పంచుకునేందుకు సుముఖంగా ఉందని అన్నారు. జి 20 అభివృద్ధి అజెండా కాశీ నగరానికి కూడా చేరినందుకు తాను సంతోషిస్తున్నానని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్‌డిజి)ని వెనక్కు నెట్టకుండా చూడటం మనందరి సమిష్టి బాధ్యత అని అన్నారు.










