- 200రోజుల పని దినాలు,600 రూపాయలు కూలి ఇవ్వాలి
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఉపాధి హామీ పరీక్షించాలని కోరుతూ సమస్యల అధ్యయన యాత్ర పేరుతో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పెద్ద లంక, మూలపాడు శివారు త్రిలోచనపురం, కేతనకొండ గట్టు చెరువు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న పని ప్రదేశంలోకి వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కూలీలు ఆయనతో మాట్లాడుతూ గత సంవత్సరములో నాలుగు వారాలు ఈ సంవత్సరంలో రెండు వారాలు బకాయిలు రావాలని అధికారుల అడుగుతుంటే బకాయిలు లేవని చెబుతున్నారని అదేవిధంగా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రెండు పూటలా పనిచేయటం వల్ల ఎర్రటి ఎండలో చేస్తున్నారు. రెండు పూటల పనిని ధానం రద్దు చేయాలని వారన్నారు. వంద రోజులు పని చాలటంలేదని అదనంగా ఉపాధి హామీ పని దినాలు పెంచాలని కనీసం 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, చేసిన పనికి ఎంత పడిపోయాని తెలియాలంటే ఫే స్లీప్ లు ఇవ్వాలని, మేట్లుకు శిక్షణ ఇవ్వాలని వారన్నారు. ఈ కార్యక్రమంలోమూలపాడు, జూపూడి, కేతనకొండ గ్రామాల మేట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు.










