ఆందోళన చేస్తున్న రైతులు
ప్రజాశక్తి గోరంట్ల : మండలంలోని బూదిలి తండా సమీపాన తమ పొలాలకు వెళ్లే దారి మూసివేశారన్న ఆగ్రహంతో పలువురు రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోతలపల్లి, చాగలేరు, గుమాలపల్లి, పెద్దిరెడ్డిపల్లి గ్రామాలకు ఈ దారి నుండే రాకపోకలు కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథంలో బూదిలి తండా వద్ద ఈ దారికి భూ యజమాని ఈ రస్తా భూమి తనకే చెందుతుందని రాతి బండలు నాటడంతో తమకు దారి లేకుండా పోయిందన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి తమకు దారి సౌకర్యం కల్పించాలని తండాకు చెందిన రైతులు కోరుతున్నారు.










