Jul 11,2022 18:19

ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ : మండలంలోని షేర్ మహమ్మద్ పేట  గ్రామం నుండి విజయవాడలో మహా ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు మూడు కార్ లలో సోమవారం బయలుదేరి వెళ్లారు. షేర్ మమ్మద్ పేట గ్రామంతోపాటు జగ్గయ్యపేట, తక్కెళ్ళపాడు, అనుమంచిపల్లి, చిల్లకల్లు, సాయి నగర్ నుండి కార్యకర్తలు ఇరువిగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి మాట్లాడుతూ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణంతోపాటు మండలంలో గల సమస్యలను వినతి పత్రాల రూపంలో ఇచ్చేందుకు తరలి వెళ్తున్నామని, ముఖ్యంగా షేర్ మహమ్మద్ పేట గ్రామ సమీపంలో గల గ్రీన్ టెక్ ఫ్యాక్టరీ ని తీసివేయాలని, సాయినగర్ సమీపంలో గల ఆటోనగర్ లో గల ఫార్మా కంపెనీల వల్ల సాయి నగర్ లోని భూగర్భ జలాలు పూర్తిగా నీళ్లు మారతంతో పాటు ఆ నీళ్లు వాడుకోవటానికి సైతం ఉపయోగపడలేదని కాబట్టి కాలుష్యం వెదజల్లే, భూగర్భ జలాలను ప్రభావితం చేసినటువంటి ఫార్మా కంపెనీలను మూసివేయాలని తదితర సమస్యలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి  సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కోటా కృష్ణ,కోట రవికుమార్, దంతాల వెంకటేశ్వర్లు, షేక్ గౌస్ మియా, ఎస్ ప్రణయ్ తేజ, ఎస్ రామనాథం, కె సుబ్బారావు, కోటేశ్వరి, షేక్ మీరా సాహెబ్, షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు.