May 13,2023 16:40

ప్రజాశక్తి -నందిగామ :  నందిగామ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  శనివారం ప్రారంభించారు . ముందుగా వ్యవసాయ అధికారులతో మాట్లాడి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి, రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. రైతులు దళారుల మోసానికి గురికాకుండా కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. మొక్కజొన్నకు క్వింటాకు రూ.1962/- మద్దతు ధరను ప్రభుత్వ కేటాయించిందని చెప్పారు. రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కృష్ణ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీల ( కేడీసీఎంఎస్) ద్వారా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ఆదేశించారు .
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, ఏపీ. ఆగ్రో. డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ కోవెలమూడి వెంకటనారాయణ, డీసీఎంఎస్ డైరెక్టర్ గింజుపల్లి రవి, మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, గరికపాటి నానయ్య, పాములపాటి రమేష్, గుడివాడ సాంబశివరావు, కౌన్సిల్ సభ్యులు పాకాలపాటి కిరణ్, తానూరి రాము, యాకుబ్ అలీ, బాపట్ల సాంబయ్య, కర్రీ రవీంద్ర, పట్టా శీను, కో ఆప్షన్ దాసు, పిల్లి జయరాజు, హనుమంతు శ్రీను, కరిముల్లా, వ్యవసాయ అధికారులు ఖాసిం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు .