పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు : గుంటూరు, ఎన్టిఆర్ జిల్లాల కలెక్టర్లకు సిఎం ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సిఎం జగన్ అధ్యక్షతన సోమవారం జరిగిన 33వ సిఆర్‌డిఎ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. నవరతాులు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద 48,218 మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని గుంటూరు, కృష్ణాజిల్లాల కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు ప్రాంతాల్లో ఈ స్థలాలు ఇవ్వాలని ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు దక్కుతాయని పేర్కొన్నారు. లబ్ధిదారుల జాబితాతో డిపిఆర్‌లు తయారుచేయాలని చెప్పారు. ఈ ప్రతిపాదనలను సిఆర్‌డిఎకు అప్పగించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. మే నెల మొదటివారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్లు లేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమానిు వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. అమరావతిలో 1,134.58 ఎకరాల భూమిని ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించింది. మొత్తం 20 లే అవుట్లలో ఈ స్థలాలునాుయి. ఇళ్ల పట్టాలిచ్చేందుకు సిఆర్‌డిఎ చట్టంలో మార్పులు చేసి సెక్షన్ 41(3), (4) ప్రకారం ఆర్-5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబరులో అభ్యంతరాలు, సలహాలను స్వీకరించింది. దీనిపై సిఆర్‌డిఎ బహిరంగ విచారణ జరిపింది. ఆర్-5 జోన్‌కు గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సిఎం నిర్వహించిన ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, రవాణా, రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి ప్రద్యుము, సిఆర్‌డిఎ కమిషనరు వివేక్ యాదవ్ తదితరులు పాల్గన్నారు.
- ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టుకు..
సిఆర్‌డిఎ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాజధానిప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జిఓ 45ను సవాల్ చేస్తూ.. హైకోర్టులో అమరావతి రైతులు అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రారు సోమవారం విచారణ జరిపారు. ఇదే అంశానికి చెందిన కేసులో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేస్తోందని, తాజా పిటిషన్‌ను కూడా అదే బెంచ్‌కుని వేదించాలని ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల వినతి మేరకు తాజా పిటిషన్ మంగళవారం త్రిసభ్య ధర్మాసనం విచారణకు వచ్చే అంశంపై రిజిస్ట్రీ తగిన నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.










