May 10,2023 16:23

ప్రజాశక్తి-నందిగామ : కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నందిగామ మండలం కొణతమాత్మకూరు గ్రామంలో స్కూల్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నందిగామ మండల కార్యదర్శి కటారపు గోపాల్ మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు పని చేయించి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ పరిష్కరించాలని కోరారు. పథకాలు నిలిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్లర్ 12, 14న ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ బోర్డు నిధులు తిరిగి చెల్లించాలని కోరారు. పెన్షన్ స్కాలర్షిప్ గృహ నిర్మాణ లోన్లు వంటి పథకాలు అమలు చేయాలని కోరారు. ఇసుక, సిమెంట్ , స్టీల్ తదితర నిర్మాణం మెటీరియల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ మండలం కొణతమాత్మకూరు గ్రామ కార్యదర్శి షేక్ లాల్ బాషా, యర్రంశెట్టి కృష్ణ, నాగుల్ మీరా, దుర్గ బడే మియా , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.