Sep 22,2023 11:05

ప్రజాశక్తి-విజయవాడ : స్కిల్ స్కాంలో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజమండ్రి జైలు అధికారులు ఎసిబి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. చంద్రబాబుతో జడ్జి మాట్లాడారు. రిమాండ్ లో ఏమైనా ఇబ్బందులు కలిగాయ అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎల్లుండి వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారని జడ్జి తెలిపారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సిఐడి అడుగుతోందని జడ్జి తెలిపారు. చంద్రబాబు లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారని జడ్జి పేర్కొన్నారు. తనను అకారణంగా జైల్లో పెట్టారని చంద్రబాబు జడ్జితో తెలిపారు. తన బాధ, ఆవేదనంతా అదేనని అన్నారు. తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని జడ్జి తెలిపారు. చట్టం అందరికి సమానమేనని జడ్జి తెలిపారు. మీ(చంద్రబాబు)పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయని జడ్జి పేర్కొన్నారు. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది.