Mar 26,2023 21:01
  • 43 లక్షల మంది పిల్లల దుస్థితి
  • పెరుగుదల సమస్యలతో సతమతం

న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలోని చిన్నారులు పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. భారత్‌లో దాదాపు 43 లక్షల మంది పిల్లలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. లోక్‌సభలో ఇటీవల కేంద్రమే ఈ విషయానిు వెల్లడించింది. కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలున్నాయి. వాటి ప్రకారం.. మిషన్‌ పోషన్‌ కింద 'పోషన్‌ ట్రాకర్‌' ప్రకారం ఫిబ్రవరిలో 5.6 కోట్ల మంది చిన్నారుల్లో 43 లక్షల మంది (7.7 శాతం మంది) పోషకాహార లోపానిు (మధ్యస్థం మరియు తీవ్రం) కలిగి ఉనుట్టు గుర్తించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) సమాచారానిు కేంద్ర మంత్రి సభతో పంచుకున్నారు. ఈ సమాచారం ప్రకారం.. దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల సమస్యలున్నాయి. వయసుకు తగిన ఎత్తు లేనివారు 35.5శాతం, ఎత్తుకు తగిన బరువు లేనివారు 19.3 శాతం, తక్కువ బరువుతో ఉనువారు 32.1 శాతం మంది ఉనాురు. తక్కువ బరువును కలిగి ఉన్న మహిళల సంఖ్య 18.7 శాతంగా ఉనుది. ఐదేండ్లలోపును 7.7 శాతం మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం తీవ్రంగా ఉన్నది. వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారులు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో అత్యధికంగా 46.5 శాతం మంది ఉన్నారు. ఈ విషయంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి తక్కువగా 20 శాతం మంది చినాురులను కలిగి ఉనుది. ఎత్తుకుతగిన బరువులేనిఐదేండ్ల లోపు చినాురులు అత్యధికంగా మహారాష్ట్రలో 25.6 శాతం మంది ఉనాురు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో తక్కువగా 8.4 శాతం మంది ఉనాురు. తక్కువ బరువును చినాురుల సంఖ్య బీహార్‌లో అత్యధికంగా 41 శాతంగా ఉనుది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఈ సంఖ్య తక్కువగా 12.7 శాతంగా ఉన్నది.
దేశంలోనిచినాురులు, మహిళల ఆరోగ్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ వహించాలని సామాజిక కార్యకర్తలు, ఆరోగ్య నిపుణులు సూచించారు. సంబంధిత విభాగాలకు అధిక నిధులను కేటాయించి, పథకాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా పేద చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలనాురు.