Sep 21,2023 12:45

ప్రజాశక్తి-అమరావతి : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఎసిబి కోర్టు తీర్పు ఈ రోజు సాయంత్రానికి వాయిదా పడింది. చంద్రబాబు తరుపున న్యాయవాదులు కోరడంతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు తీర్పును వెలువరించనున్నట్లు తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇరువర్గాలు కోరడంతో విచారణ 26వ తేదీకి వాయిదా వేశారు. హైబ్రిడ్ విధానంలో కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కేసు విచారించనున్నారు.