విద్యార్థినిని అభినందిస్తున్న ప్రిన్సిపల్
ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోని వివేకానంద మిలినీయం పాఠశాలకు చెందిన హర్షిత చిత్రలేఖనం పోటీల్లో మెరిసింది. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌తో పాటు ఉపాద్యాయులు ఆమెను అభినందించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతు పరీక్ష పే చర్చలో భాగంగా అనంతపురంలోని కేంద్రీయ విద్యాలయం ఆధ్వర్యంలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ, సిబిఎస్‌ఇ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అనంతపురం, సత్యసాయి సంయుక్త జిల్లాల చిత్రలేఖన పోటీలు నిర్వహించారన్నారు. ఇందులో రెండు జిల్లాలకు చెందిన 23 సిబిఎస్‌ఇ పాఠశాలలు పాల్గొన్నాయన్నారు. ఇందులో తమ పాఠశాలకు చెందిన ఎం హర్షితకు మొదటి బహుమతి దక్కిందన్నారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆటోగ్రాఫ్ పుస్తకాన్ని అందుకుందన్నారు.










