హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్ : చెట్లను నరికినందుకు భాగ్యనగర మున్సిపల్ అధికారులు దిమ్మతిరిగేలా జరిమానా విధిస్తున్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ 14వ డివిజన్‌లో అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో.. స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారమందించారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది చెట్టు నరికిన వ్యక్తికి ఏడు వేల రూపాయలు జరిమానా విధించారు. అలాగే బండ్లగూడకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి కూడా అనుమతి లేకుండా చెట్టును నరకడంతో.. అతనికి రూ. 2500 ఫైన్ విధించినట్లు మున్సిపల్ మేనేజర్ మనోహర్ తెలిపారు.










