Apr 20,2023 08:53
  • 38 శాఖల్లో కనిపిరచని వ్యయం
  • బడ్జెట్‌లో లేకుండానే 37 శాఖల్లో రూ.18 వేల కోట్లు ఖర్చు
  • అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం అభిశంసన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : బడ్జెట్‌లో పొందుపరిచినా కూడా రూ.33 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు కాలేదు. 38 శాఖల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇంతే స్థాయిలో నిధులు మరో 38 శాఖల్లో ఖర్చు కావడం గమనార్హం. తాజాగా ఫిబ్రవరి నెలాఖరు వరకు పలు శాఖల్లో జరిగిన వ్యయంపై అకౌరటెరట్‌ జనరల్‌ కార్యాలయం విడుదల చేసిన నివేదికలో ఆ శాఖల బడ్జెట్‌ నురచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని ఎత్తిచూపింది. దీంతో ఆ నిధులు ఏమయ్యాయన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇవి వేరే శాఖల ద్వారా ఖర్చు చేయడం గమనిస్తే ఇది మళ్లిరపేనని అంటున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో తొలి 11 నెలల వ్యయ పరిస్థితిపై ఎజి కార్యాలయం వెల్లడిరచిన గణాంకాల మేరకు 38 శాఖల్లోని 1964 అంశాలకు సంబంధించి బడ్జెట్‌లో రూ.33,146 కోట్లు కేటాయిరచారు. ఇరదులో ఏ అంశంలో కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఎజి కార్యాలయం పేర్కొంది. కొన్ని శాఖల్లోని 1,193 విభాగాల్లో రూ.32,145 కోట్లు బడ్జెట్‌ కేటాయింపుల కన్నా అదనంగా వ్యయం చేసినట్లు గుర్తిరచిరది. ఖర్చు చేయాల్సిన శాఖల నిధులను ఇతర శాఖలకు మళ్లిరచి వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది. ద్రవ్య నిర్వహణ, ప్లానిరగ్‌, సర్వే విభాగంలో రూ.16,197 కోట్లు కేటాయిరచగా, అరదులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రెవెన్యూశాఖలోని కొన్ని విభాగాలకు కేటాయించిన రూ.1,629 కోట్లు, పాఠశాల విద్యా రంగంలో రూ.2,719 కోట్లు, రోడ్లు భవనాలశాఖలోని కొన్ని విభాగాల్లో రూ.1,140 కోట్లు, వైద్య రంగంలో రూ.2,204 కోట్లు, పట్టణాభి వృద్ధిలో రూ.1,690 కోట్లు, పంచాయతీరాజ్‌లో రూ.1,315 కోట్లు, నీటిపారుదల రంగంలో రూ.2,011 కోట్లు, విద్యుత్‌శాఖలో రూ.704 కోట్లు, పరిశ్రమల శాఖలో రూ.678 కోట్లు కేటాయింపులు చేసినా వాటిల్లో ఒక్క పైసా కూడా ఖర్చు జరగలేదని గుర్తిరచారు. బడ్జెట్‌ కేటాయిరపుల కన్నా రూ.32,145 కోట్లు అధికంగా ఖర్చు చేసిన విభాగాలను పరిశీలిస్తే ప్లానిరగ్‌, సర్వే రంగంలో రూ.17,598 కోట్లు అధికంగా వ్యయం జరిగింది. గృహ నిర్మాణంలో రూ.2,510 కోట్లు, విద్యా రంగంలోని కొన్ని విభాగాల్లో రూ.1,109 కోట్లు, ఇంధన విభాగంలోని కొన్ని పద్దుల్లో రూ.4,525 కోట్లు అదనంగా వ్యయం చేసినట్లు తేలింది. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించక పోయినప్పటికీ వాస్తవంగా మాత్రర రూ.18,121 కోట్లను ఖర్చు చేసినట్లు ఎజి కార్యాలయం గుర్తించింది.

  • బడ్జెట్‌ విధానానికి వ్యతిరేకం

రాష్ట్ర ఫైనాన్స్‌ కోడ్‌లోని నిబంధనలు పాటిరచడం లేదని ఎజి కార్యాలయం వ్యాఖ్యానించింది. ఖర్చుల కోసం అవసరమైన నిధులను సిద్ధం చేయాలని, బడ్జెట్‌లో పొందుపరిచిన నిధులకన్నా ఎక్కువ ఖర్చు చేయరాదని, చేసిన ఖర్చును నిర్ధిష్ట ఉత్తర్వుల మేరకే అమలు చేయాలని, అత్యవసరం కాకుండా వ్యయాన్ని పెంచరాదని నిబంధనలు ఉన్నాయని ఎజి తన నివేదికలో గుర్తు చేసింది.