Jan 30,2021 20:30

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినబడుతోన్న డిజిటల్‌ నగదు 'క్రిప్టోకరెన్సీ'పై భారత ప్రభుత్వం నిషేధం విధించాలని చూస్తోంది. ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది. 'ది క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్‌ా 2021'పేరుతో రూపొందించింది. ఈ బిల్లు ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. క్రిప్టోకరెన్సీ స్థానంలో ఆర్‌బిఐ తీసుకురాబోయే అధికారిక డిజిటల్‌ కరెన్సీకి సంబంధించిన నియమావళి రూపకల్పనకు ఈ బిల్లు తోడ్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ప్రయివేటు క్రిప్టోకరెన్సీని నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకొస్తోందని వెల్లడించాయి.