Jul 06,2022 21:10
  • కాయిన్‌ స్విచ్‌ ఫెమా ఉల్లంఘన..!

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ బ్రోకరేజీ ఎజెన్సీలపై  మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అప్రమత్తమయ్యింది.  క్రిప్టో కరెన్సీ ఎక్సేంజీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విదేశీ మారకం నిబంధనలను అతిక్రమిస్తున్న కాయిన్‌ స్విచ్‌, కాయిన్‌డిసిఎక్స్‌లకు ఇడి నోటీసులు జారీ చేసింది. ఇంతక్రితం కూడా కాయిన్‌డిసిఎక్స్‌ వ్యవస్థాపకులు సుమిత్‌ గుప్తాను బెంగళూరులో ఇడి అధికారులు ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ రెండు సంస్థలు గత మూడేళ్లుగా నమోదు చేసిన లావాదేవీలను ఇడి అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని సమాచారం.