అచ్చెన్నాయుడితో మాట్లాడుతున్న పెదరాసు సుబ్రమణ్యం, తదితరులు
ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : 2024 ఎన్నికలలో టిడిపి తరఫున పుట్టపర్తి అసెంబ్లీ టికెట్‌ను బలిజలకు కేటాయించాలని సీనియర్ నాయకుడు పెదరాసు సుబ్రహ్మణ్యం కోదారు. ఈ మేరకు ఆదివారం ఆయనతో పాటు మరికొందరు నాయకులు విజయ వాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడును కలిసి విన్నవించారు. పుట్టపర్తి నియోజ కవర్గంలో సుమారు 45 వేల మంది బలిజలు ఉన్నారన్నారు. తాను మొదటి నుంచి టిడిపిలో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. తన భార్య లక్ష్మీదేవి బుక్కపట్నం ఎంపీపీగా సేవలందించిందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కృషి చేసిన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పల్లపు జయచంద్ర మోహన్ తదితరులు ఉన్నారు.










