Jan 24,2023 21:57

విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

       పుట్టపర్తి అర్బన్‌ : లింగ వివక్ష చూపకుండా బాలబాలికలను సమానంగా పెంచాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ విద్యా, వైద్య ఆరోగ్య మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాల బాలికలకు ఇద్దరికీ సమాన హక్కులు కల్పించాలన్నారు. ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువగా చూడరాదన్నారు. ప్రజలలో అవగాహన కల్పించి ఆడపిల్లలను రక్షించుకోవాలన్నారు. లింగ వివక్షతను, గర్భస్థలింగ నిర్ధారణను వ్యతిరేకించాలన్నారు. బాలికలు ఎందులోనూ తీసిపోరనానరు. వారి ఉన్నత విద్యకు తల్లిదండ్రులు అవకాశం కల్పించాలన్నారు. వారం రోజులపాటు నిర్వహించిన బాలికల దినోత్సవం సందర్భంగా వకత్యపు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన 9 మందికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు కలెక్టర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి, జిల్లా వైద్యాధికారి ఎస్‌వి.కష్ణారెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకుమారి, డిఐఒ డాక్టర్‌ కష్ణయ్య, డిపిఎం కుళ్లాయప్ప, వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.