Oct 09,2020 06:51

అర్నబ్‌ గోస్వామి...ఏ అర్నబ్‌ గోస్వామి...
ఎక్కడున్నావు? ఎక్కడున్నావ్‌ నువ్వు...?
ఇప్పుడు అరవవా.. ఇప్పుడు అరవలేవా...
మనీషా మీద అత్యాచారం జరిగింది. తనకి పూడ్చలేని నష్టం జరిగింది.
అర్నబ్‌ గోస్వామి ఎక్కడున్నావ్‌? ఎక్కడ దాక్కొన్నావ్‌?
ఇప్పుడు రా మీడియా లోకి. రా...చర్చ పెట్టు....
బాధిత...నీ కూతురు కాదు కదా? నీ కూతురికి ఎలాంటి చెడు జరగలేదు కదా? అందువల్ల నీకు ఆ బాధ తెలియడంలేదు. నొప్పి కలగడం లేదు కదా?
అవును...కంగనా కోసం నీ నోరు లేస్తుంది కదా?
ప్రధానమంత్రి మోడీ ... ఎక్కడున్నావ్‌ నువ్వు? ఏం...కంగనా నీ కూతురా? తనకి భద్రత ఇస్తున్నావ్‌ కదా?
అన్నట్టు...
యోగీ ఆదిత్యనాథ్‌ ఎక్కడున్నావ్‌? సమాధానం ఇవ్వు. జవాబు చెప్పు.
ఈ దేశ ప్రజలు మిమ్మల్నందర్నీ ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో రోజుల నుండి...నెలల నుండి...సంవత్సరాల నుండి...తమకు రక్షణ కల్పించమని అడుగుతున్నారు. కానీ మీరు ఆ పని చేయలేకపోతున్నారు.
'బేటీ బచావ్‌, బేటీ పఢావ్‌' నినాదం తీసుకొచ్చారు కదా మీరు.
కానీ...ఏం చేస్తున్నారు మీరు? దేశం ఏ మాత్రం సురక్షితంగా లేదు. దేశంలోని ఆడపిల్లలకు, కూతుళ్లకు ఏమాత్రం రక్షణ లేదు.
దిగిపోండి. కుర్చీల నుండి దిగిపోండి.
పోండి ఎక్కడకి వెళ్తారో.
ఎప్పుడూ భగవంతుని జపం చేస్తుంటారు కదా. వెళ్లి పూజలు చేసుకోండి.
అరే...మీకు కొంచెమైనా సిగ్గు లేదా?
...ఆడపిల్లల మీద ఇంత దౌర్జన్యం జరుగుతోంది!
ఒక 19 సంవత్సరాల అమ్మాయిని మాట రాకుండా చేశారు. వెన్నెముక విరిచేశారు. మెడ నరాలు తెంచేశారు. ఎముకలు విరిచేశారు. ఇంత దారుణం జరుగుతున్నా...మీ చెవిటి ప్రభుత్వం చెవులకు సోకడం లేదు!
స్మృతి ఇరానీ...ఓరు స్మృతి ఇరానీ...ఎక్కడ వున్నావ్‌ నువ్వు? ఎక్కడ నక్కావ్‌?
మహిళల గురించి తెగ మాట్లాడుతుంటావ్‌ కదా. నీకు బిజెపి లో చాలా సౌకర్యంగా వుంది కదా?
ఈ అమాయకపు ఆడపిల్లల బాధ పట్టడం లేదా! ఎక్కడ దాక్కొని కూర్చున్నావ్‌?
అసలు ఎక్కడున్నారు మీరంతా?
బిజెపి లో ఇంత మంది మహిళలు గెలిచారు కదా. ఎక్కడున్నారు?
ఎవ్వరూ ముందుకు రారా...
అవున్లే ...అత్యాచార బాధితులు మీ కూతుళ్లు కాదు కదా?
గుండెల్లో బాధాతప్త బాణం గుచ్చుకోవడం లేదు కదా. అవును మరి. అందరూ కళ్ళు మూసుకొని పోయినవాళ్లే.
ఎక్కడున్నారు మీరంతా?
ప్రభుత్వం వుంది కదా? దీనికంతటికీ ప్రభుత్వానిదే బాధ్యత. మీ అందరిది కూడా...
ఆడపిల్లల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలు చూసి మీ రాతి గుండెలు కరగడం లేదా?
అవున్లే...వారు పేద వాళ్ళు కదా...
అందుకని మీకు ఎటువంటి బాధ కలుగదు. వీళ్ల ఏడుపులు కనిపించవు కూడా.
మీకు డబ్బున్నవారి కష్టాలు, మీడియాలో హైలైట్‌ అయ్యే విషయాలే కన్పిస్తాయి కదా?
ఓరు...అర్నబ్‌ గోస్వామి! రా ముందుకి. చర్చ పెట్టు.
కూతుళ్ల మీద... ఆడవాళ్ల మీదా... వారి సమస్యల మీదా చర్చ పెట్టడం చేతకాదు నీకు.
ఆడవాళ్లు షో చేస్తున్నారు. హైలెట్‌ అవ్వడం కోసం మాట్లాడుతున్నారని అనుకుంటావ్‌ కదా.
అరే అర్నబ్‌ గోస్వామి..
ఈ నేతలకు ఎటువంటి బాధ కలుగదు... ఏడుపు రాదు..
ఉత్తర ప్రదేశ్‌లో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా!? కానీ ఏలికలు ఇంకా కూర్చీలో కూర్చొని తమాషా చూస్తున్నారు.
జరిగిన ఘోరానికి సమాధానం లేదు... కన్నీళ్లు రావడం లేదు...కానీ...
వేదికల మీద నిలబడితే చాలు...నీతి, న్యాయం గురించి మాట్లాడతారు కదా? ఇప్పుడేదీ న్యాయం?
మీ వల్ల ప్రజలకు...దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు. దిగిపోండి కూర్చీల నుండి. (హధ్రాస్‌ వంటి ఘటనలకు చలించిపోయిన ఓ మధ్య తరగతి మహిళ ఆక్రోశం...ఆవేశం... ఆవేదన ఇది. సోషల్‌ మీడియాలో వీక్షకులను ఆలోచింపచేస్తున్న హిందీ వీడియోకు స్వేచ్ఛానువాదం షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌)