ప్రజాశక్తి -పెనుకొండ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా డిమాండ్ చేశారు. బుధవారం పట్టణం లో ఎన్ హెచ్ 44 హైవే జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఆటో యూనియన్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గౌస్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ స్వయంకృషితో బతుకుతున్న ఆటో కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సిఐటియు మండల నాయకులు తిప్పన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి , మహబూబ్‌బాషా, ఆటో యూనియన్ నాయకులు వజ్రం నాగప్ప , రెడ్డప్ప, మూర్తి, మునియప్ప తదితరులు పాల్గొన్నారు.










