Jul 16,2021 17:51

అమరావతి : ఎపిలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 పరీక్షలు నిర్వహించగా.. 2,345 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,34,450 మంది వైరస్‌ బారినపడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,097కి చేరింది. ఇదే సమయంలో 3,001 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,96,499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,96,437 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.