ఇంఫాల్ : భద్రతా సిబ్బంది దురాగతాలకు వ్యతిరేకంగా మణిపూర్‌లో గురువారం పలుచోట్ల మహిళలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 'అణిచివేత వ్యతిరేక దినం' పాటించి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2004 జులై 11న బమన్ కంపూ వద్ద ఒక మహిళను భద్రతా సిబ్బంది అక్రమంగా అరెస్టు చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ప్రతీ ఏడాది జులై 15న అణిచివేత వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తారు. 2004 జులై 14న అస్సాం రైఫిల్స్ గేట్ ముందు 12 మంది మహిళలు నగంగా నిరసన వ్యక్తం చేయడం అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.










