Dec 06,2020 16:54

మంత్రాలయం (కర్నూలు) : చలితీవ్రతతో ఇబ్బందులుపడుతున్న అనాథ పిల్లలకు దుప్పట్ల కొనుగోలు కై వాలంటరి బసప్ప నాయుడు 5 వేల రూపాయలను అందించారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీగురు రాఘవేంద్ర సేవాదళ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌వారి అనాథ ఆశ్రమానికి వాలంటరి చేరుకున్నారు. పిల్లలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులకు ఒక నెల జీతాన్ని అందించి అనాథలను ఆదుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని కోసిగి మండలంలోని జంపాపురం గ్రామానికి చెందిన బసప్ప నాయుడు గతంలో కూడా మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో బాధలు పడుతున్న కుటుంబాలకు తనకు వచ్చిన జీతాలను విరాళంగా అందించి మానవత్వాన్ని చాటారు.