Jan 23,2023 21:40

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

ప్రజాశక్తి - నల్లచెరువు : మండల పరిధిలోని శ్రీ పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం కదిరి శాసనసభ్యులు డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన పాలకమండలి చైర్మన్‌గా డి. భాస్కర్‌ రెడ్డి, పాలకమండలి సభ్యులుగా పి సూర్యనారాయణ, ఎస్‌ జానకమ్మ, పి అంజనమ్మ, ఎం అరుణమ్మ, ఎస్‌. ఉమాదేవి, జి. గోవిందరెడ్డి, ఎక్స్‌ఆఫిషియో మెంబర్‌ గా కె.ఆంజనేయదాస్‌ చేత ఆలయ కార్యనిర్వాహణాధికారి రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, జెడ్పీటీసీ బసిరెడ్డి అనిత విశ్వనాథ్‌ రెడ్డి, సర్పంచి పంచరత్నమ్మ, ఎంపీటీసీ సుమియా, రఫీ, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల చైర్మన్లు, డైరెక్టర్లు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్‌ క్లబ్‌ ప్రారంభం
మండల కేంద్రంలోని బిఎస్‌ అమీర్‌ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌క్లబ్‌ను కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పివి సిద్ధారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల ఘంగం మండల అధ్యక్షులు హరినాథ్‌ రెడ్డి, పాత్రికేయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, జెడ్పీటీసీ అనితా విశ్వనాథ్‌ రెడ్డి, ఎంపీడీవో శకుంతల, ఏవో భారతి, ఏపీఎం రమణమ్మ, సర్పంచులు సంఘం మండల అధ్యక్షులు దాసరిశ్రీనాథ్‌ రెడ్డి, యువ నాయకులు సానే హరినాథ్‌ రెడ్డి, పాత్రికేయులు శ్రీనివాసులు, రమణ, ఆంజనేయులు, శ్రీనివాసులు, విజరు కుమార్‌ రెడ్డి, సిద్దు, ఆంజనేయులు, కృష్ణమూర్తి, మహేశ్వర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, లతీఫ్‌, షబ్బీర్‌, షాకీర్‌, బావాజీ తదితరులు పాల్గొన్నారు.