Nov 29,2022 21:55

విరాళం అందజేస్తున్న 'బత్తల'

కదిరి టౌన్‌ : రూరల్‌ మండలం కుమ్మరవాండ్ల పల్లి పంచాయతీ గంగనగారి పల్లిలోని సీతారామ స్వామి ఆలయ అభివృద్ధికి వైసిపి రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ విరాళం అందజేశారు. కుమ్మరవాండ్లపల్లి లోని తన స్వగృహంలో గ్రామస్తులకు రూ. 1.50 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా బత్తల హరి ప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామస్తులు రామాలయ నిర్మాణానికి పూనుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర, పెద్ద పాపిరెడ్డి, పెద్ద కృష్ణ, లక్ష్మణ, శంకర్‌, గంగాద్రి, నర్సింహులు, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు.