Feb 05,2021 20:37

తుళ్లూరు (గుంటూరు) : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామానికి చెందిన రైతు నిమ్మగడ్డ వెంకట్రావు (46) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. వెంకట్రావు అమరావతి రాజధాని నిర్మాణానికి ల్యాండ్‌ పూలింగ్‌లో 1.26 ఎకరాల భూమి ఇచ్చాడు. అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గంటున్నాడు. రాజధాని తరలిపోతుందేమోనని తరచూ ఆందోళనకు గురయ్యేవాడని, ఆ క్రమంలోనే గుండెపోటుకు గురై చనిపోయాడని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 416వ రోజుకు చేరాయి. తుళ్లూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెలగపూడి, వెంకటపాలెం, మందడం, ఐనవోలు, నేలపాడు గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు ఆందోళనల్లో పాల్గన్నారు.