దేవరాపల్లి : మండలంలోని బోయిలకింతాడ గ్రామంలో ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ఆదేశించారు. గవరవరం నుంచి కాశీపురం వెళ్లే రోడ్డును ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం బోయిలకింతాడ సచివాలయం నిర్మాణం పనులు, కల్వర్టు పరిశీలించారు. మహాత్మా గాంధీ విగ్రహం నుంచి రుద్రభూమి వరకు సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు బూరే బాబురావు, ఆన్నం రామునాయుడు, కొప్పాక దేవుళ్లు, బొబ్బిలి రాము పాల్గొన్నారు.










