- కౌన్సిల్‌కు ముగ్గురు, అసెంబ్లీకి ఒకరు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర శాసనసభ, శాసనమండళ్లకు ప్రభుత్వ విప్‌లను నియమించారు. కౌన్సిల్‌కు ముగ్గురు, శాసనసభకు ఒకరిని చొప్పున నియమిస్తూ రెరడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ కొద్ది నెలల్లోనే ముగిసిపోతున్న చివరి తరుణంలో ఈ నియామకాలు జరగడం గమనార్హం. శాసనసభలో ప్రభుత్వ విప్‌గా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శాసనసభ్యుడు గ్రరధి శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శాసనమండలికి విప్‌లుగా లేళ్ల అప్పిరెడ్డి, మేరిగ మురళీధర్, పాలవలస విక్రారత్‌ను నియమించారు.
ముందస్తు ఎన్నికలు ఉరటే డిసెంబరులో, లేదంటే వచ్చే ఏడాది మే నాటికి శాసనసభ రద్దవుతుంది. ఈ తరుణంలో కొత్తవారిని నియమించడం ఆశ్చర్యం కలిగిస్తోరది. ఇప్పటికే శాసనసభలో పదిమంది విప్‌లు ఉన్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారా?, లేక కొత్తగా నియమితులైన వ్యక్తులు అదనంగానా? అన్నది ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు.










