ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : నవరత్నాలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనతో పేదలకు మేలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కొనియాడారు. మండలంలోని జొన్నాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టి ఇప్పటి వరకు 98.44 శాతం హామీలను అమలు చేసిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందజేస్తున్నారన్నారు. ఈ గ్రామ సచివాలయం 1 ద్వారా రూ.10.56 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ, ఒకొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్ధిక సహాయం జరిగిందో వివరించారు. స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమైనా ఉంటే తనకు నేరుగా చెప్పండని మహిళలను అడిగారు. తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను అక్కడికక్కడే స్థానిక అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, మాజీ ఎంపిపి తోరాటి రాంబాబు, రాష్ట్ర సేవా సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు, సర్పంచ్‌లు కట్టా శ్రీనివాసు, గుణ్ణం రాంబాబు, ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ద్వారంపూడి దొరబాబు, సొసైటీ చైర్మన్లు తాడి మెహర్ ఆదిత్యారెడ్డి, నెక్కింటి వెంకటరాయుడు (బుజ్జి), నేతలు దూలం సత్తిబాబు, దొండపాటి చంటి, అన్యం వెంకన్న, ఎంపీడీవో కే.జాన్ లింకన్, తాహసిల్దార్ జి.లక్ష్మీపతి, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ పోసమ్మ, ఆర్‌ఐ జానకి రాఘవ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










