Feb 22,2023 16:43

కేప్‌టౌన్‌ : 8వ మహిళల టీ20 వరల్డ్‌కప్‌ చివరి దశకు చేరింది. గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, భారత్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్లో గ్రూప్‌-1 టాపర్‌ ఆస్ట్రేలియా.. గ్రూప్‌-2లో రెండో స్థానంలో నిలిచిన టీమిండియాతో తలపడనుండగా.. ఫిబ్రవరి 24న జరుగనున్న రెండో సెమీస్‌లో గ్రూప్‌-2 టాపర్‌ ఇంగ్లండ్‌.. గ్రూప్‌-1లో రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాను తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 26న కేప్‌టౌన్‌లో జరుగనున్న టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకుంటారు.