ఇంటర్నెట్‌డెస్క్ : మహిళలు హ్యాండ్‌బ్యాగ్స్ లేనిది బయటకు అడుగుపెట్టరు. ఆ బ్యాగ్స్‌లో సెల్‌ఫోన్స్, ఇంటితాళాలు, లేదా ప్తుసకాలు, మేకప్‌కిట్, మనీపర్స్ లాంటివి అవసరమైనవన్నీ వేసుకుంటారు. మరి ఇన్ని వస్తువులతో ఆ బ్యాగ్ మోయలేనంత బరువుగా ఉంటుంది. అలాంటిది ప్రతిరోజూ మహిళలు భుజాన వేసుకుని మోయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. హ్యాండ్‌బ్యాగ్ వల్ల అనారోగ్య సమస్యలేంటా? అని ఆశ్చర్యపోతున్నారా.. ఓసారి మీరు వీటి గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు.
- హ్యాండ్‌బ్యాగ్‌ని ఎప్పుడూ ఒక భుజాన వేసుకుని మోయడం వల్ల రెండు భుజాలెప్పుడూ సరైన భంగిమలో ఉండవు. దీంతో వెనునొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- హ్యాండ్‌బ్యాగ్‌లో అవసరమైనవి, అవికూడా పరిమితమైన వస్తువులే వేసుకోవం వల్ల బ్యాగ్ బరువుగా ఉండదు. దాంతో వెన్ను సమస్యలు తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
- హ్యాండ్‌బ్యాగ్ భుజాన వేసుకునే అలవాటు మానుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. బ్యాగ్‌ని చేతికి తగిలించుకోవడమో లేదా చేత్తో పట్టుకోవడమో చేస్తే అనారోగ్య సమస్యలు రావని డాక్టర్లు చెబుతున్నారు.