లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఎటిపి) తాజా ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ సంచలన కార్లోస్ అల్కరాజ్ మరోసారి సత్తాచాటాడు. తాజా ఏటిపి ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్ ర్యాంక్‌కు ఎగబాకాడు. అలాగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఇగా స్వైటెక్, పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ టాప్ ర్యాంక్‌తో బరిలోకి దిగనున్నారు. ఇదే క్రమంలో నాలుగుసార్లు ఛాంపియన్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ రెండోర్యాంక్‌కే పరిమితమయ్యాడు. నొవాక్ జకోవిచ్ ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నెగ్గి రికార్డు స్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత టోర్నమెంట్‌లకు దూరంగా ఉండడంతో అల్కరాజ్ ఆ టోర్నీలో టైటిళ్లను కైవసం చేసుకోవడంతో టాప్ ర్యాంక్‌కు చేరాడు. ఇంగ్లండ్‌లోని గ్రాస్‌కోర్ట్, క్వీన్స్‌క్లబ్ తాజాగా ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇక మహిళల సింగిల్స్‌లో అర్యానా సబలెంక(బెలారస్)కు 2వ, ఎలేనా రైబకినాకు 3వ ర్యాంక్ దక్కింది. ఇదే క్రమంలో పురుషుల సింగిల్స్‌లో మెద్వదెవ్(రష్యా) 3వ, కాస్పర్ రూఢ్ 4వ, సిట్సిపాస్ 5వ ర్యాంక్‌లో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఛాంపియన్ ఆండీ ముర్రే 39వ ర్యాంక్ దక్కినా.. అన్‌సీడెడ్‌గానే బరిలోకి దిగనున్నాడు.










