నల్లగొండ : 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా సోమవారం ఘనంగా కొనసాగుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని తలపించేలా నాగార్జున సాగర్ ప్రాజెక్టును అధికారులు విద్యుత్ కాంతులతో అలంకరించారు. 26 క్రష్ గేట్ల నుంచి విడుదలైన నీటి సోయగాలపై మువ్వన్నెల జెండాలోని మూడు రంగుల విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. త్రివర్ణాన్ని అందంగా చూపిస్తోన్న సాగర్ అందాలు పర్యాటకులకు ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు ... నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,10,868 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో: 3,34,242 క్యూసెక్కులుగా నమోదయింది. నీటి సామర్థ్యం 297/312 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం నీటిమట్టం 584.90/ 590 అడుగులకు చేరింది.










