Apr 19,2023 21:36

సిడ్నీ: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్లో భారత్‌తో తలపడే ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు బుధవారం ప్రకటించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సిఏ) సెలెక్షన్‌ కమిటీ సభ్యులు బెయిలీ ప్రకటించిన 17మంది ఆటగాళ్ల బృందంలో ఓపెనర్ల విభాగంలో సీనియర్‌ డేవిడ్‌ వార్నర్‌ చోటు దక్కించుకున్నాడు. రెన్‌షా, హర్రీస్‌ కూడా ఓపెనర్ల కోటాలోనే జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా భారత్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన వార్నర్‌.. డబ్ల్యుటిసి ఫైనల్లో చోటు దక్కించుకోవడం విశేషం. సీనియర్‌ బ్యాటర్స్‌ స్టీవ్‌ స్మిత్‌, సీనియర్‌ స్పిన్నర్‌ లియాన్‌లకు కూడా సిఏ ప్రకటించిన జట్టులో చోటు లభించింది. ఇక భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యుటిపి ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 7నుంచి ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరగనుంది.
జట్టు: పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), బొలాండ్‌, క్యారీ, గ్రీన్‌, హర్రీస్‌, హేజిల్‌వుడ్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, ఖవాజా, లబూషేన్‌, లియాన్‌, మిఛెల్‌ మార్ష్‌, మర్ఫీ, రెన్‌షా, స్టీవ్‌ స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌.