May 12,2023 12:33

నందిగామ (ఎన్‌టిఆర్‌) : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సయ్యద్‌ ఖాసిం బృందం శుక్రవారం నందిగామ మండలం రాఘవపురంలో ఉపాధి హామీ రక్షణ యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా ... రాఘవపురంలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు నేతలతో మాట్లాడుతూ ... పనిచేసే చోట కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుగూపార, ఇతర సౌకర్యాలు కల్పించేవారని.. ఇప్పుడు అవేవీ లేవని టెంట్లు, నీళ్లు, మెడికల్‌ కిట్లు, కట్టకు, ఇతర సౌకర్యాలకు డబ్బులు కలిసేవని అన్నారు. కూలి ఎంత పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందని వాపోయారు. పేస్లిప్‌ లు ఇచ్చేవారు లేరని నాయకులకు విన్నవించారు. పనిచేసే చోట భద్రత లేదని, మంచినీళ్లు, టెంటు లేవని, ఐదు కిలోమీటర్లు దూరం నుంచి వెళ్లవలసి వస్తే రానుపోను చార్జీలు అవుతున్నాయని చెప్పారు. ఎవరికైనా గాయాలైతే ప్రాధమిక చికిత్స, గర్భిణీలు, వఅద్ధులు, వికలాంగులు చేయగలిగే పనులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మెట్లు కూలీలు, తదితరులు పాల్గొన్నారు