May 27,2023 12:39

ఐపీఎల్‌ చరిత్రలోనే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడిన మొదటి ఆటగాడిగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు విష్ణు వినోద్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ముంబై వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కంటికి గాయమైంది. దీంతో కిషన్‌ బ్యాటింగ్‌ రాలేదు. ఈ క్రమంలో అతడి స్థానంలో విష్ణు వినోద్‌ కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఈ మ్యాచ్‌లో వినోద్‌ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. గుజరాత్‌ చేతిలో 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఓటమి చేందింది. 233 పరుగుల భారీ స్కోర్‌ లక్ష్య చేధనలో 171 పరుగులకే ముంబై ఆలౌటైంది.