విజయవాడ: భూకబ్జాల కోసమే విశాఖను రాజధానిగా చేస్తున్నారని ,ఉత్తరాంధ్రకు వైసిపి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎపికి ప్రత్యేక హౌదా, రైల్వేజోన్‌పై వైసిపి నేతలు మాట్లాడడం లేదన్నారు. జేఏసీ పేరుతో వైసిపి నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే మూడు రాజధానుల ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు










